రొమాన్స్ సీన్స్‌ల్లో నా నటనకు మద్దతు తెలపనందుకు నా భర్త సిగ్గుపడుతున్నాడంటున్న హీరోయిన్

ఈ సోషల్ మీడియా కాలంలో హీరోయిన్‌లు తరచుగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ఇటువంటి ఘటనలపై సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా అప్పుడప్పుడు మాత్రమే స్పందిస్తుంటారు. బాలీవుడ్‌లో రాధికా ఆప్టే ఇప్పటికే తన గళాన్ని వినిపించింది. మాలీవుడ్ నుంచి ఒక హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై తన గళాన్ని వినిపించింది.


హీరోయిన్‌లతో సహా మహిళ నటులు వారు ధరించిన దుస్తులు, తెరపై కనిపించిన విధానం, సోషల్ మీడియా పోస్ట్‌లతో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. నెటిజన్లు చేసే ట్రోలింగ్‌కు సామాజిక మాధ్యమాల్లో ఒక హీరోయిన్ సమాధానం చెప్పింది.  కుడుక్కు 2025 అనే సినిమాలో మలయాళ నటి దుర్గా కృష్ణ నటించింది. ఆ సినిమా నుంచి మారన్ అనే రొమాంటిక్ సాంగ్‌ విడుదలైంది. ఆ పాటలో కిస్సింగ్ సీన్‌లో నటించినందుకు తనను నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారని ఆమె ఆరోపించింది. తనకు అనేక మంది అసభ్య సందేశాలు పంపిస్తున్నారని వెల్లడించింది. ప్రేక్షకులు ఎందుకు రెండు నాలుకల ధోరణీని అవలంభిస్తున్నారని ప్రశ్నించింది. ‘‘ రొమాన్స్ సీన్స్‌ల్లో నేను, హీరో కృష్ణ కలిసి నటించాం. కృష్ణకు అతడి భార్య మద్దతు తెలిపింది. కానీ, నా భర్త మద్దతు తెలుపనందుకు సిగ్గుపడుతున్నాడు. హీరో, హీరోయిన్లు ఇద్దరం రొమాన్స్ సీన్స్‌ల్లో నటించినప్పుడు హీరోయిన్‌లనే ఎందుకు ట్రోలింగ్ చేస్తారు. అటువంటి ట్రోలింగ్‌కు  హీరోలు ఎందుకు గురి కారు’’ అని ప్రశ్నించింది.

నెటిజన్లు చేసే ట్రోలింగ్ పై ఆమె ఒక వీడియోను విడుదల చేసింది. ‘‘ ఒక మహిళ అసభ్య పదజాలంతో నన్ను దూషించిన మెసేజ్‌ను  స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టాను. కాసేపటికే ఆమె నన్ను క్షమాపణ కోరింది. ఆ స్క్రీన్ షాట్‌ను డిలీట్ చేయాలని రిక్వెస్ట్ చేసింది. అందుకు నేను అంగీకరించలేదు. ఆమె భర్త అది చూస్తే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పింది ’’ అని  ఆ వీడియోలో వివరించింది.


హీరోయిన్ లు ట్రోలింగ్ కు గురికావడం అనేది ఇదే మొదటి సారి కాదు. బాలీవుడ్‌కు చెందిన రాధికా ఆప్టే వంటి నటులు ఆన్ లైన్ ట్రోలింగ్ కు వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పుతూనే ఉన్నారు. అనేక మంది నటులు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తే అందుకు ధీటైన సమాధానం కూడా ఇస్తున్నారు.

Advertisement