Abn logo
Sep 17 2021 @ 03:26AM

నా భర్త ఏం చేసేవాడో తెలీదు: శిల్పాశెట్టి

ముంబై, సెప్టెంబరు 16: ‘నా పనుల్లో నేను బిజీగా ఉన్నాను. నా భర్త ఏం చేస్తున్నాడో నాకు తెలియదు’ అని బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి ముంబై పోలీసులకు చెప్పారు. పోర్నోగ్రఫీ కేసులో ఆమె భర్త రాజ్‌కుంద్రా అరెస్టయి జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసులు శిల్పాశెట్టిని సాక్షిగా చేర్చారు. ఈ సందర్భంగా తాను సినిమా షూటింగుల్లో బిజీగా ఉండడం వల్ల తన భర్త ఏం చేస్తుండేవాడో పట్టించుకోలేదని ఆమె చెప్పినట్లు పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. అలాగే హాట్‌షాట్స్‌, బాలీఫేమ్‌ యాప్‌ల గురించి తనకు తెలియదని శిల్పా చెప్పినట్టు వివరించారు. కాగా, కేసులో ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు రాజ్‌కుంద్రాతోపాటు ఆయన సహచరుడు ర్యాన్‌ థోర్ప్‌లకు వ్యతిరేకంగా 1500 పేజీలతో కూడిన అనుబంధ చార్జిషీట్‌ను బుధవారం కోర్టులో సమర్పించారు. సినిమా అవకాశాల కోసం వచ్చిన యువతులను రాజ్‌ కుంద్రా, ర్యాన్‌ థోర్ప్‌ వంచించి నీలిచిత్రాలు తీసేవారని, వాటిని కొన్ని యాప్‌ల ద్వారా మార్కెటింగ్‌ చేసుకునేవారని పేర్కొన్నారు.