‘మై హోమ్‌’కు రెండోరోజు షాక్ ఇచ్చిన పంచాయతీశాఖ

ABN , First Publish Date - 2022-07-09T23:26:57+05:30 IST

‘మై హోమ్‌’ (My Home)కు పంచాయతీశాఖ రెండోరోజు షాక్ ఇచ్చింది. సిమెంట్‌ పరిశ్రమలో నాలుగో యూనిట్‌ విస్తరణ పనులను పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు ఆదేశాలిచ్చారు.

‘మై హోమ్‌’కు రెండోరోజు షాక్ ఇచ్చిన పంచాయతీశాఖ

సూర్యాపేట: ‘మై హోమ్‌’ (My Home)కు పంచాయతీశాఖ రెండోరోజు షాక్ ఇచ్చింది. సిమెంట్‌ పరిశ్రమలో నాలుగో యూనిట్‌ విస్తరణ పనులను ఆపాలని పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు ఆదేశాలిచ్చారు. 1.75 ఎంటీపీఎస్ క్లింకర్ (MTPS Clinker), సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యంతో. 32 హెక్టార్ల విస్తీర్ణంలో సిమెంటు పరిశ్రమను మై హోమ్ ఇండస్ట్రీస్ నిర్మిస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న కట్టడాలను వెంటనే నిలిపివేయాలని గ్రామపంచాయతీ అధికారులు ఆదేశించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రంలోని సర్వే నంబర్‌ 1057లో 630 ఎకరాల భూమి ఉంది. అందులో 150 ఎకరాల భూదానోద్యమ భూమి, మరో 18 ఎకరాల సీలింగ్‌ భూమి ఉంది. అలాగే, మైహోమ్‌ సిమెంట్స్‌కు 131 ఎకరాలు ఉండగా, మిగతా 330ఎకరాలు రైతుల పట్టా భూమి ఉంది. కాగా, 2009లో భూదాన్‌ భూమిలో మైహోమ్‌ సిమెంట్స్‌ యాజమాన్యం కట్టడాలు చేపడుతోందంటూ పత్రికల్లో వచ్చిన కథనాల మేరకు లోకాయుక్త సుమోటోగా స్వీకరించింది. భూదాన్‌ భూమిని స్వాధీనం చేసుకోవాలని అదే ఏడాది రెవెన్యూ శాఖను హైకోర్టు ఆదేశించగా.. దీనిపై మైహోమ్‌ యాజమాన్యం అప్పీల్‌ చేసుకుంది. ఆ తర్వాత, 2012 డిసెంబరులో హైకోర్టు స్టే ఆర్డర్‌ జారీ చేయగా, కొంతకాలం నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఇటీవల మైహోమ్‌ యాజమాన్యం భూదాన్‌ భూమిలో మళ్లీ నిర్మాణాలు చేపడుతుండడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు.

Updated Date - 2022-07-09T23:26:57+05:30 IST