Oct 13 2021 @ 13:26PM

నాకు ఇష్టమైన ఫొటో ఇది: అఖిల్ అక్కినేని

నాకు ఇష్టమైన ఫొటో ఇది అంటూ అక్కినేని వారసుడు అఖిల్  తాజాగా తన మొబైల్ వాల్‌పేపర్‌పై ఉన్న ఓ ఫొటోను రివీల్ చేశాడు. ప్రతీ ఒక్కరి జీవితంలో గొప్ప వ్యక్తులు, మార్గదర్శకులు ఉంటారు. వారికి సంబంధించిన కొన్ని విషయాలను, సంఘటలను, వస్తువులను జీవితాంతం మర్చిపోలేము. అలాంటి అందమైన జ్ఞాపకం అఖిల్ లైఫ్‌లోనూ ఉందని తాజాగా ఆయన మొబైల్ వాల్‌పేపర్ మీద ఉన్న తన తాత, లెజండరీ నటులు అక్కినేని నాగేశ్వర రావుగారి ఫొటోను రివీల్ చేశాడు. ఈ సందర్భంగా అఖిల్.. "నేను నా ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే కనిపించే ఫొటో ఇదే. పదేళ్ల నుంచి ఇదే ఫొటోను చూస్తున్నాను. మా తాతగారికి సంబంధించి నాకు ఇష్టమైన స్టిల్ ఇది. నేను ఫోన్ మార్చినా.. ఈ లాక్ స్క్రీన్ మాత్రం ఇలానే ఉంటుంది. అలా నాకు అలవాటైపోయింది. నేను ఈ ఫొటో మార్చను. ఇది నా ఫేవరెట్ స్టిల్. నిజానికి ఇది సినిమాలో స్టిల్ కాదు, తాతయ్యను ఆడిషన్ చేసినప్పుడు లుక్ టెస్ట్ కోసం తీసిన ఫొటో. నాకు ఫొటో బాగా నచ్చింది. అందుకే పదేళ్ల నుంచి అలా ఉండిపోయింది".. అని తెలిపాడు. కాగా ఆయన నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ అక్టోబర్ 15న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ నిర్మించారు.