Abn logo
Apr 27 2021 @ 11:21AM

అమ్మా.... ఈ సారైనా నన్ను మనింటికి పంపిస్తారా?

నా కొడుకు పదే పదే కన్నీటితో అడుగుతూనే ఉన్నాడు.... "అమ్మా.... ఈ సారైనా నన్ను మనింటికి పంపిస్తారా?".... అని. కానీ, నా దగ్గర జవాబు లేదు.


నేను నిస్సహాయురాలిని... చాలా కలవరంగా ఉంది. ఎంతో సంతోషంగా, సంతృప్తిగా ఉంటున్న నలుగురు సభ్యుల మా కుటుంబం ఇప్పుడు ప్రతిరోజూ ఒక పీడ కలలా జీవించే పరిస్థితికి దిగజారిపోయింది.


ప్రాణాంతకమైన వ్యాధితో బతుకు పోరాటం చేస్తున్న నా కొడుకును చూసుకుంటూ ప్రతిక్షణం ఓడిపోతూనే ఉన్నాను.


వాడు పుట్టినప్పుడు మేమంతా పరమానందపడ్డాం. నాగ వెంకట ఈశ్వర్ అని పేరు పెట్టుకున్నాం. నా కుటుంబ జీవనం హాయిగా గడిచిపోయేది. కానీ, రెండేళ్ళ కిందట నా కొడుక్కి మాటల్లో చెప్పలేనటువంటి ఒక విధమైన జ్వరం, ఒంటిపైన దద్దుర్లు మొదలయ్యాయి.


బాబుని వెంటనే సిటీ హాస్పిటల్ తీసుకెళ్లాం. ఈశ్వర్‌కి బ్లడ్ క్యాన్సర్ అని తెలియగానే మా జీవితం అల్లకల్లోలం అయిపోయింది.


ఎంత ఆవేదన కలిగినా సహించాం... ఎందుకంటే, మా అబ్బాయి పడుతున్న బాధ ముందు మా వేదన చాలా చిన్నది. పిల్లాడికి మంచి వైద్యం చేయించడం కోసం బాగా అప్పులు చేశాం... మాకున్న కాస్తంతా అమ్మేశాం.


వైద్యం వల్ల ఈశ్వర్ కోలుకుంటున్నట్టు డాక్టర్లు చెప్పినప్పుడు ఆ దేవుడు మా ప్రార్థన విని పిల్లాడిని కాపాడాడని ఆనందించాం. ఇంటికి తిరిగొచ్చి చేసిన అప్పులు తీర్చడం మొదలుపెట్టాం. మా పిల్లలిద్దరూ ఆరోగ్యంగా ఉండటం వల్ల ఆశలు చిగురించాయి.


కానీ, మేం సంతోషంగా ఉండటం చూసి ఆ విధికి కన్నుకుట్టింది. మళ్ళీ చిన్నచూపు చూసింది. బాలుడి చికిత్సకు సాయం చేసేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి

ఈశ్వర్‌కి తదుపరి చికిత్స కొనసాగిస్తున్నప్పుడు వాడి ముఖం వాచిపోవడం, తరచూ తలనొప్పి రావడం లాంటి లక్షణాలు మొదలయ్యాయి. స్కాన్ చేయిస్తే... బ్లడ్ క్యాన్సర్ మరింత ముదిరిందని, B- Acute Lymphoblastic Leukemiaతో బాధపడుతున్నాడని బయటపడింది. ఈ మాట విని మేం మూగబోయాం.

ఈశ్వర్ ప్రాణం నిలబడాలంటే వెంటనే కీమోథెరపీ చేయించాలని, 

బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ జరగాలని డాక్టర్లు చెప్పారు. ఇందుకు సుమారుకు రూ.30 లక్షలు ($ 41000.13) ఖర్చవుతుందట.


బోన్ మ్యారోకి ఈశ్వర్ చెల్లెలు... అంటే 2 సంవత్సరాల వయసున్న మా పాపాయి జయశ్రీ దాతగా సరిపోతుందని డాక్టర్లు అన్నారు. ఈ అవకాశమైనా మా అబ్బాయిని కాపాడుతుందనే ఆశతో ఉన్నాం.


ఈ వైద్యం కోసం ఇంత పెద్ద మొత్తం సంపాదించడం మా జీవితాలకు కాని పని. కానీ, అది జరగకపోతే మా అబ్బాయి శాశ్వతంగా మాకు దూరమైపోతాడు.


రెండేళ్ళ మా పాపాయి జయశ్రీకి ఇదేమీ తెలియదు... బాధపడుతున్న తన అన్నయ్యను అలా గమనిస్తూ ఉంది. ఇంత చిన్న వయసులోనే సర్జరీలు చేయించుకోవలసిన ఆ పిల్లల్ని చూస్తుంటే నాకు ఎంతో ఆందోళనగా ఉంది.


మా ఈశ్వర్ ఎంతో చురుకుగా, హుషారుగా ఉండే పిల్లాడు. వాడి ముఖంలో చిరునవ్వు మాయమైంది. మా పిల్లలిద్దరూ ఎదుర్కుంటున్న బాధాకరమైన పరిస్థితిని రోజు తల్చుకుని భరించలేకపోతున్నాను.


నేను, నా భర్త నిరుపేద వ్యవసాయ కూలీలం. చాలీచాలని ఆదాయంతో బతుకుతున్నాం. బాబు వైద్యానికి ఖర్చు చెయ్యడానికి మాదగ్గర ఇంకేమీ లేదు. మా పిల్లల పరిస్థితికి పరిష్కారంగా మిగిలిన చిట్టచివరి ఆశల్లా ఆ దేవుణ్ణి ప్రార్థించడం.... ఆ పైన మీ దయార్ద్ర హృదయంపై ఆధారపడటం.


దయచేసి మా అబ్బాయి ఎప్పటిలా చిరునవ్వులు చిందించేందుకు సహకరించండి. చెదిరిన మా కలలు... బాధిస్తున్న పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడేది మీ ఉదార హృదయమే. మిమ్మల్ని కోరేది ఇదొక్కటే. మా అబ్బాయికి అండగా నిలబడండి.