Abn logo
Aug 7 2020 @ 14:19PM

‘మై బాయ్ ఫ్రెండ్‌స్ గ‌ర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ లుక్ లాంచ్ విడుదల చేసిన ప్రభాస్

‘వినాయకుడు’ ఫేమ్ కృష్ణుడు నిర్మాతగా చేస్తున్న సినిమా ‘మై బాయ్  ఫ్రెండ్‌స్ గ‌ర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్యాన్ ఇండియా స్టార్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేశారు. కుమార్తె నిత్య పేరు మీద నిత్యా క్రియేషన్స్‌ అని ఆయన ఓ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశారు హీరో కృష్ణుడు. తొలి ప్రయత్నంగా ‘మై బాయ్  ఫ్రెండ్‌స్ గ‌ర్ల్ ఫ్రెండ్’ నిర్మించారు. త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసిన ప్ర‌భాస్ చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.

 

ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ ‘‘‘మై బాయ్  ఫ్రెండ్‌స్ గ‌ర్ల్ ఫ్రెండ్’ సినిమా   అందరికి నచ్చేలా ఉండే కంప్లీట్ లవ్  కామెడీ ఎంటర్ టైనర్. ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూశాక సంతృప్తిగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు నటుడిగా నన్నెంతో ఆదించారు. నిర్మాతగా ప్రయాణం ప్రారంభిస్తున్నాను. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తు న్నాను’’ అని తెలిపారు.  లోతుగడ్డ జయరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement