నా బ్యూటీ సీక్రెట్‌ అదే

బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ ఆన్‌స్ర్కీన్‌పై అదరగొట్టే పెర్ఫార్మెన్స్‌ చేస్తుంది. సహజంగానే ఆమె స్కిన్‌టోన్‌ బావుంటుంది. అప్పుడప్పుడూ ఇన్‌స్టాలో తన బ్యూటీ టిప్స్‌ను పంచుకుంటుంది కూడా. ఇంతకీ అనుష్క శర్మ బ్యూటీ సీక్రెట్స్‌ ఏంటో తెలుసుకుందాం. 


‘‘నా అందాన్ని కాపాడుకోవడానికి కచ్చితమైన డైట్‌ పాటిస్తాను. మంచి ఆహారం, ఉదయాన్నే వర్కవుట్స్‌, మెడిటేషన్‌.. ఇలా ఏదీ వాయిదా వేసుకోను. కష్టంగా భావించకుండా ఈ పనులన్నీ ఇష్టంగా చేస్తా. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే వర్కవుట్స్‌ తప్పని సరి. ఎంతగా వర్కవుట్స్‌ ఇష్టపడతానంటే.. సినిమా షూటింగ్స్‌, ఎంత బిజీ పనులున్నా సరే దినచర్య తప్పను. మెటబాలిజమ్‌ను పెంచటమే కాకుండా రోజువారీ ఒత్తిడి కూడా తగ్గుతుంది.. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ముఖ్యంగా నిద్రబాగా పడుతుంది. ఆరేడు గంటలు తప్పక నిద్రపోతా. దీని వల్ల మూడ్‌ స్వింగ్‌ కాకుండా ఉంటుంది. అదే నా బ్యూటీ సీక్రెట్‌. కథానాయికగా రాణించాలంటే ఆ మాత్రం శ్రమ అవసరం. మేకప్‌ వేసుకోకముందు ఫేసియల్‌ మసాజ్‌కి అధిక ప్రాధాన్యత ఇస్తా. దీనివల్ల ముఖంపై రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. రీఫ్రెష్‌ అయినట్లుంటుంది. మాయిశ్చరైజర్‌, సన్‌స్ర్కీన్‌ లోషన్‌ కూడా వాడతాను.’’

Advertisement

Bollywoodమరిన్ని...