Abn logo
Jul 12 2020 @ 15:43PM

‘మిస్టర్ లోన్లీ’ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

ఎస్.కె.ఎమ్.ఎల్ మోషన్ పిక్చర్స్ నేతృత్వంలో రూపొందుతున్నచిత్రం ‘మిస్ట‌ర్ లోన్లీ’. డైరెక్ట‌ర్ ముక్కి హ‌రీశ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో కాండ్రేగుల ఆది నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట‌ర్‌ను విశాఖ పార్ల‌మెంట్ స‌భ్యుడు, సినీ నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ  ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా పార్ల‌మెంట్ స‌భ్యుడు ఎం.వి.వి.సత్యనారాయణ చిత్ర యూనిట్‌ను అభినందించి సినిమా ఘ‌న విజ‌యం సాధించాల‌ని కోరారు. ‘యువతను ఆకట్టుకునే కథతో, కాలేజ్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ  చిత్రం అన్ని వర్గాల ప్రజలను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు విశేషమైన ఆదరణ లభించింది’ అన్నారు. దర్శకుడు హరీశ్ కుమార్, కెమెరామెన్ గారా, నటీనటులు విక్కీ, , కియారెడ్డి , సోనాలి వర్ధమ్, లోహిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement