క్యాంపస్‌ సెలక్షన్లలో ఎంవీఆర్‌ విద్యార్థులకు ఉద్యోగాలు

ABN , First Publish Date - 2022-01-26T06:20:15+05:30 IST

డిసెంబరులో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో తమ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంఈఐటీ మల్టీ టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు సాధించారని ఎంవీఆర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సురేష్‌ బాబు తెలిపారు.

క్యాంపస్‌ సెలక్షన్లలో ఎంవీఆర్‌ విద్యార్థులకు ఉద్యోగాలు
అర్హత సాధించిన విద్యార్థులతో కళాశాల ప్రిన్సిపల్‌

క్యాంపస్‌ సెలక్షన్లలో ఎంవీఆర్‌ విద్యార్థులకు ఉద్యోగాలు

పాయకాపురం, జనవరి 25 : డిసెంబరులో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో తమ కళాశాలకు  చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంఈఐటీ మల్టీ టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు సాధించారని ఎంవీఆర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సురేష్‌ బాబు తెలిపారు. గవర్నర్‌ పేటలోని ఎంవీఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కార్యాల యంలో మంగళవారం విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంగణ ఎంపికల్లో అర్హత సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హత సాధించిన విద్యార్థులకు సదరు కంపెనీ ఏడాదికి రూ. 2 లక్షలకు పైగా వేతనం ఇవ్వడం గర్వకారణం అన్నారు. కె.అజయ్‌, లీలా రవి కృష్ణ, ఎస్‌. వివేక్‌, నాంచారయ్య, డి. కార్తీక్‌లు ఉపాధి పొందినట్లు తెలిపారు. తమ కళాశాల చైర్మన్‌ ముత్తవరపు శ్రీనివాసబాబు విద్యార్థులను అభినందించినట్లు వెల్లడించారు. సివిల్‌ ఇంజనీరింగ్‌  విభాగాధిపతి డాక్టర్‌ పి. బాలకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-26T06:20:15+05:30 IST