Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 8 2021 @ 09:23AM

Muzaffarnagar స్కూల్ బాలికల వేధింపుల కేసులో ఇన్‌స్టిట్యూట్ మేనేజర్ అరెస్ట్

ముజఫర్‌నగర్ : ముజఫర్‌నగర్ పట్టణంలో 17 మంది బాలికలను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడైన పాఠశాల మేనేజర్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఒక పాఠశాలలో 17వ తరగతి 10వ తరగతి బాలికలను నవంబర్ 17న క్యాంపస్‌కు పిలిచి ప్రాక్టికల్ పరీక్ష సాకుతో రాత్రిపూట ఉండమని అడిగాడు.పాఠశాల మేనేజర్‌ బాలికలకు మత్తుమందు కలిపిన ఆహారాన్ని అందించి వారిని లైంగికంగా వేధించాడని పోలీసులు చెప్పారు. ఈ కేసులో బాధితులైన బాలికల వాంగ్మూలాలను నమోదు చేయడానికి పోలీసులు ఇద్దరు విద్యార్థినులను కోర్టులో హాజరుపరిచారు. 

అయితే వారిలో ఒకరి స్టేట్‌మెంట్‌ మాత్రమే నమోదు చేయగలిగారు.నిందితుడు యోగేష్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి అర్థరాత్రి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదులు నమోదు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పుర్కాజి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వినోద్ కుమార్ సింగ్‌పై పోలీసు ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ ప్రారంభించారు.


Advertisement
Advertisement