మువ్వన్నెల సంబరం

ABN , First Publish Date - 2022-08-08T05:30:00+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలైన వేళ... ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా సోమవారం జిల్లావ్యాప్తంగా త్రివర్ణ పతా కం రెపరెపలాడింది.

మువ్వన్నెల సంబరం
లేపాక్షిలో భారీ జాతీయ పతాకంతో విద్యార్థుల ప్రదర్శన

లేపాక్షి/పావగడ/రొద్దం/చిలమత్తూరు/పెనుకొండ/ హిందూపురం అర్బన, ఆగస్టు 8: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలైన వేళ... ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా సోమవారం జిల్లావ్యాప్తంగా త్రివర్ణ పతా కం రెపరెపలాడింది. ఊరూవాడా సంబరమైంది. లేపాక్షి ఓ రియంటల్‌ పాఠశాల విద్యార్థులు 522 అడుగుల పొడవైన జాతీయ పతాకంతో గ్రామంలో భారీ ప్రదర్శన చేపట్టారు. నంది విగ్రహం వరకు కొనసాగిన ర్యాలీలో భారత మాతాకీ జై అంటూ నినదించారు. జనం రోడ్లకు ఇరువైపులా నిలబ డి జాతీయ పతాకాన్ని స్వాగతించారు. తహసీల్దార్‌ బాబు, ఎంపీడీఓ నరసింహనాయుడు, ఎంఈఓ నాగరాజునాయక్‌ పాల్గొన్నారు. పావగడలో 1750 అడుగుల జాతీయ జెండా పురవీధుల్లో రెపరెపలాడింది. వివేకానంద కళాశాల నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు ఐదు వేల మందికిపైగా విద్యార్థు లు జెండా ప్రదర్శిస్తూ ఊరేగించారు. విద్యాసంస్థ కార్యదర్శి డాక్టర్‌ వెంకటరామయ్య, మాజీ ఎమ్మెల్యే తిమ్మరాయప్ప, హెల్ప్‌ సొసైటీ అధ్యక్షుడు శశికిరణ్‌, పట్టణ ప్రజలు జాతీ య జెండాకు గౌరవ వందనం చేసి, పూలతో స్వాగతించా రు. రొద్దం మండలం పెద్దగువ్వలపల్లి జిల్లాపరిషత ఉన్నత పాఠశాల విద్యార్థులు త్రివర్ణపతాకంతో దేశభక్తిని చాటుకున్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర ఫలాలను గుర్తు చేసుకుంటూ, అదే సంఖ్య ఆకృతిని ప్రదర్శించేలా జెండాలు చేతపట్టి కూ ర్చున్నారు. ఈ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నరేంద్రకుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిలమత్తూరు గ్రామ సచివాలయం లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సర్పంచ సంధ్య, వెలుగు ఏపీఎం భారతి, ఈఓఆర్డీ సుభాషిణమ్మ ఆ ధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో... మహిళలు జాతీయ జెం డా ముగ్గులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈనెల 15న విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.


13న పెనుకొండలో భారీ ర్యాలీ 

పెనుకొండలో ఈనెల 13న జాతీయ పతాకాలతో భారీ ప్రదర్శన చేపట్టనున్నట్లు సబ్‌ కలెక్టర్‌ నవీన పేర్కొన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో ఆజాదీకా అమృతమహోత్సవ్‌ నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, పాఠశాలల విద్యార్థులు, ప్రజలు పెద్దఎత్తున వేడుకలకు తరలిరావాలని పిలుపునిచ్చారు. జూనియర్‌ కళాశాల ఆవరణలో సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ స్వర్ణలత, ఎంపీడీఓ శివశంకరప్ప, డిప్యూటీ డీఈఓ రంగస్వామి, ఎంఈఓ గంగప్ప, హౌసింగ్‌ డీఈ నాగరాజు, మున్సిపల్‌ కమిషనర్‌ వంశీకృష్ణభార్గవ్‌, చైర్మన ఉమర్‌ఫారూక్‌, సీఐ కరుణాకరణ్‌ పాల్గొన్నారు. పోస్టల్‌ ఉద్యోగులు పెనుకొం డలో ర్యాలీ నిర్వహించారు. పోస్టల్‌ ఇనస్పెక్టర్‌ విమల్‌కుమా ర్‌, కార్యాలయం సిబ్బంది బ్యానర్లు, జాతీయజెండాలతో ప్ర దర్శన చేపట్టారు. అనంతరం ఇనస్పెక్టర్‌ మాట్లాడుతూ పో స్టాఫీసులో రూ.25 చొప్పున జాతీయ పతాకాలను విక్రయి స్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలన్నారు.


పరిటాల శ్రీ రాములు ప్రభుత్వ డిగ్రీకళాశాలలో క్విట్‌ ఇండియా ఉద్యమ దినాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమే్‌షరెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ హరీ్‌షబాబు, డాక్టర్‌ ప్రతాప్‌, అధ్యాపకుడు రా జేష్‌, విద్యార్థులు పాల్గొన్నారు. హిందూపురంలో డిప్యూటీ చీ ఫ్‌ ఇనస్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ కేశవులు ఆధ్వర్యంలో తూము కుంట పారిశ్రామికవాడలోని బర్జర్‌ పెయింట్స్‌ పరిశ్రమలో  వేడుకలు నిర్వహించారు. 13, 14, 15 తేదీల్లో ప్రతి ఇంటిపై జెండా ఎగరాలని సూచించారు. 

Updated Date - 2022-08-08T05:30:00+05:30 IST