జంతువులు రోడ్లపైకి రాకుండా చూడండి

ABN , First Publish Date - 2021-10-20T04:54:28+05:30 IST

రహదారిపైకి కుక్కలు, ఆవులు, గేదెలు, మేకలు రాకుండా అఽధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ముత్యాల పల్లి సెంటర్‌లో స్థానికులు రాస్తారోకో చేశారు.

జంతువులు రోడ్లపైకి రాకుండా చూడండి
ముత్యాలపల్లి సెంటర్‌లో రాస్తారోకో చేస్తున్న గ్రామస్థులు

ముత్యాలపల్లిలో గ్రామస్థుల రాస్తారోకో


మొగల్తూరు,అక్టోబరు 19 : రహదారిపైకి కుక్కలు, ఆవులు, గేదెలు, మేకలు  రాకుండా అఽధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ముత్యాల పల్లి సెంటర్‌లో స్థానికులు రాస్తారోకో చేశారు. రాత్రి, పగలు తేడా లేకుండా కుక్కలు, ఆవులు, గేదెలు, మేకలు  రోడ్లుపై తిరుగుతుండంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కుక్కలు వాహనదారుల వెంట పడడంతో ప్రమా దాలకు గురవుతున్నారన్నారు. ఆవులు, గేదెలు, మేకలు వాహనదారులకు అడ్డు వస్తున్నాయన్నారు.పంచాయతీ అధికారులు ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆందోళనలో కరెళ్ళ ముక్తేశ్వరరావు, భాస్కరరావు, కొల్లాటి ఓంకార్‌, కొల్లాటి కనకసు బ్బారావు, బర్రె బ్రహ్మానందం,రంగారావు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T04:54:28+05:30 IST