ముత్యాలమ్మ జాతరకు రూ.90 లక్షలు

ABN , First Publish Date - 2022-05-27T05:48:31+05:30 IST

ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ జాతర నిర్వహణకు రూ.90 లక్షలు వెచ్చించే అవకాశాలున్నాయి.

ముత్యాలమ్మ జాతరకు రూ.90 లక్షలు
జాతర వాల్‌ పోస్టర్‌ విడుదల చేస్తున్న చైర్మన్‌, ఆలయ కమిటీ సభ్యులు

మొగల్తూరు, మే 26: ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ జాతర నిర్వహణకు రూ.90 లక్షలు వెచ్చించే అవకాశాలున్నాయి. ఈ మేరకు దేవదాయ శాఖ నుంచి అనుమతి లభించినట్టు ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ కొల్లాటి రామారావు, ఈవో డి.రామకృష్ణంరాజు గురువారం తెలిపారు. ఐదేళ్ల క్రితం నిర్వహించిన జాతరకు సుమారు రూ.62 లక్షలు ఖర్చయిందని, ప్రస్తుతం పెరిగిన ఖర్చులతో సుమారు రూ.కోటి ఖర్చయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ విప్‌ ప్రసాదరాజు దృష్టికి తీసుకువెళ్ళగా దేవాదాయ శాఖ ఆర్‌జేసీతో చర్చించి రూ.90లక్షలుకు అనుమతి ఇచ్చారని వారు వివరించారు. ఆలయం వద్ద ప్రత్యేక మొబైల్‌ టాయిలెట్స్‌, భక్తులకు తాగునీరు, ప్రథమ చికిత్స, సంపూర్ణ పారిశుధ్యం, ట్రాఫిక్‌ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 


జాతర వాల్‌ పోస్టర్‌ విడుదల

బండి ముత్యాలమ్మ జాతర వాల్‌ పోస్టర్‌ను గురువారం ఆలయం వద్ద విడుదల చేశారు. ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌, పాలకవర్గ సభ్యులు, గ్రామ సర్పంచ్‌ ఉత్సవ కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. వచ్చే నెల 13న జాతర జరుగుతుందని, ఈనెల 29 నుంచి 12 వరకూ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వివరించారు.


ఉత్సవ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి

జాతర సందర్భంగా ఉత్సవ కమిటీని తక్షణం ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలు డిమాండ్‌ చేశారు. గురువారం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కొల్లాటి రాజారావు, కడలి మధుసూదన్‌, బొక్కా వెంకట్రావు, నిప్పులేటి తారక రామారావు, కర్రి వీరాస్వామి విలేకరులతో మాట్లాడుతూ జాతర సమయం సమీపిస్తుందని, ఇప్పటివరకూ ఉత్సవ కమిటీని దేవదా య శాఖ నియమించలేదన్నారు. ఇక్కడ అమ్మవారికి సంబంధించి ముత్యా లపల్లి, మోడి, వారతిప్ప, కొత్తోట గ్రామాల్లో 8 కులాలకు చెందిన వారి భాగస్వామ్యంతో జాతర మమేకమైందన్నారు. అమ్మవారి ట్రస్ట్‌బోర్డుతో పాటు జాతర నిర్వహణకు సంబందించి ఉత్సవ కమిటీ ఆవశ్యకత ఎంతో ఉందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కమిటీని తక్షణమే ప్రకటించాలని వారు కోరారు.

Updated Date - 2022-05-27T05:48:31+05:30 IST