Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మటన్‌ రోస్ట్‌

మటన్‌ రోస్ట్‌

కావలసినవి: మటన్‌ - అరకేజీ, మిరియాల పొడి - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - పావు టీస్పూన్‌, నూనె - సరిపడా, ఉల్లిపాయ - ఒకటి, టొమాటో - ఒకటి, అల్లం - రెండు అంగుళాల ముక్క, వెల్లుల్లి - ఐదారు రెబ్బలు, కారం - ముప్పావు టీస్పూన్‌, ధనియాల పొడి - పావు టీస్పూన్‌, గరంమసాల - అరటీస్పూన్‌, సోంపు - అర టీస్పూన్‌, కరివేపాకు - రెండు రెమ్మలు, ఉప్పు - తగినంత.


తయారీ విధానం: మటన్‌ను శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేసి మిరియాల పొడి, పసుపు వేసి ఒక కప్పు నీళ్లు పోసి ఉడికించాలి.మొదటి విజిల్‌ వచ్చే వరకు పెద్ద మంటపై ఉడికించాలి. తరువాత చిన్నమంటపై అరగంటపాటు ఉడికించాలి. కుక్కర్‌లో ఆవిరిపోయాక మటన్‌ను ఒక బౌల్‌లోకి మార్చుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. సోంపు, దంచిన అల్లంవెల్లుల్లి, కరివేపాకు వేయాలి.కారం, ధనియాల పొడి, గరంమసాల, తగినంత ఉప్పు వేసి కలపాలి. కాసేపు వేయించుకున్నాక టొమాటో ముక్కలు వేసి మరో రెండుమూడు నిమిషాలు ఉడకనివ్వాలి.ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మటన్‌ మిశ్రమాన్ని వేయాలి. పెద్ద మంటపై కాసేపు ఉడికించుకుని దింపుకోవాలి.


కబాబ్స్‌కబాబ్స్‌మటన్‌ కట్‌లెట్స్‌మటన్‌ కట్‌లెట్స్‌వర్క్యూ లుక్మేవర్క్యూ లుక్మేటర్పెండో పెప్పర్టర్పెండో పెప్పర్భార్వాన్‌ టంగ్డిభార్వాన్‌ టంగ్డిగిలౌటి కబాబ్‌ విత్‌ ఉల్టా తవ్వా కా పరోటాగిలౌటి కబాబ్‌ విత్‌ ఉల్టా తవ్వా కా పరోటాఅన్నానేటివ్‌ కోడి కారమ్‌ చిప్స్‌అన్నానేటివ్‌ కోడి కారమ్‌ చిప్స్‌టిక్కాటిక్కామంచూరియామంచూరియాఫిష్‌ కేక్‌ఫిష్‌ కేక్‌
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.