మటన్‌ కీమా బాల్స్

ABN , First Publish Date - 2020-07-18T17:33:32+05:30 IST

మటన్‌ కీమా - అరకేజీ, బిర్యానీ పువ్వు - కొద్దిగా, మిరియాలు - టీస్పూన్‌, యాలకులు - నాలుగైదు, ధనియాలు - టేబుల్‌స్పూన్‌, జీలకర్ర - టీస్పూన్‌, దాల్చినచెక్క - కొద్దిగా

మటన్‌ కీమా బాల్స్

కావలసినవి: మటన్‌ కీమా - అరకేజీ, బిర్యానీ పువ్వు - కొద్దిగా, మిరియాలు - టీస్పూన్‌, యాలకులు - నాలుగైదు, ధనియాలు - టేబుల్‌స్పూన్‌, జీలకర్ర - టీస్పూన్‌, దాల్చినచెక్క - కొద్దిగా, తోక మిరియాలు - అర టీస్పూన్‌, లవంగాలు - ఐదారు, ఎండుమిర్చి - పది, నూనె - సరిపడా, ఉప్పు రుచికి తగినంత, బ్రౌన్‌ ఆనియన్స్‌ - అరకప్పు, కొత్తిమీర, పుదీనా - కొద్దిగా, సెనగపప్పు - టేబుల్‌స్పూన్‌, అల్లంవెల్లుల్లి -  టేబుల్‌స్పూన్‌, కోడిగుడ్డు - ఒకటి.


తయారీ: మటన్‌ కీమాను శుభ్రంగా కడగాలి. సెనగపప్పు నానబెట్టాలి. ముందుగా మసాలా సిద్ధం చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కాస్త వేడి అయ్యాక మిరియాలు, యాలకులు, ధనియాలు, జీలకర్ర, తోక మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ పువ్వు, ఎండుమిర్చి వేసి వేగించాలి. వీటితో పాటు బ్రౌన్‌ ఆనియన్స్‌ మిక్సీలో వేసి మసాలా పొడి తయారు చేసుకోవాలి. సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, నానబెట్టిన సెనగపప్పు వేయాలి. చివరగా కీమా వేసి, కోడిగుడ్డు కొట్టి వేయాలి. తగినంత ఉప్పు వేసి మరొకసారి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని ప్లేటులోకి తీసుకుని మసాలాలు బాగా కలిసేలా కలపాలి. స్టవ్‌పై మరొక పాత్ర పెట్టి నూనె పోసి, ఈ మిశ్ర మాన్ని కొద్ది కొద్దిగా   బాల్స్‌లా చేసుకుంటూ నూనెలో డీప్‌ ఫ్రై చేస్తే మటన్‌ కీమా బాల్స్‌ రెడీ.

Updated Date - 2020-07-18T17:33:32+05:30 IST