మటన్‌ కిలో రూ.400

ABN , First Publish Date - 2022-09-25T05:30:00+05:30 IST

ప్రస్తుతం మార్కెట్‌లో మాంసం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మటన్‌ ధరల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కిలో రూ.700 నుంచి రూ.800 వరకు విక్రయిస్తున్నారు.

మటన్‌  కిలో రూ.400
అక్బర్‌పేటలో మటన్‌ కోసం బారులు తీరిన మాంసం ప్రియులు

దాదాపు నెల రోజులుగా అదే ధరకు విక్రయం

అక్బర్‌పేటకు పోటెత్తిన మాంసం ప్రియులు


 మిరుదొడ్డి, సెప్టెంబరు 25: ప్రస్తుతం మార్కెట్‌లో మాంసం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మటన్‌ ధరల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కిలో రూ.700 నుంచి రూ.800 వరకు విక్రయిస్తున్నారు. పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఆ ధరలు ఇంకాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే మిరుదొడ్డి మండలం అక్బర్‌పేట గ్రామంలో మాత్రం కిలో మటన్‌ రూ.400కు విక్రయిస్తున్నారు. దాదాపు నెలరోజుల నుంచి ఆ గ్రామంలో ఇదే ధరకు అమ్ముతున్నారు. విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో మాంసం ప్రియులు పోటెత్తారు. నిన్న ఆదివారం అందులోనూ మహాలయ అమావాస్య కావడంతో ఆ గ్రామం రద్దీగా మారింది. దుబ్బాక, మిరుదొడ్డి, గజ్వేల్‌, దోమకొండా, బీబీపేట, రామాయంపేట, చేగుంట, దౌల్తాబాద్‌ మండలాల భారీగా తరలివచ్చారు. సిద్దిపేట మెదక్‌ ప్రధాన రహదారి వాహనాలతో నిండింది.  భూంపల్లి పోలీసులు రంగ ప్రవేశం చేసి మాంసం ప్రియులను అదుపుచేశారు. రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. అయితే ఇంత తక్కువ ధరకు మటన్‌ విక్రయిస్తుండడంతో ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు వ్యాపారులు అడ్డుకున్నారు. ఎవరి ఇష్టం మేరకు వారు వ్యాపారం చేసుకుంటున్నారని, అడ్డుకోవడం తగదని అక్బర్‌పేట గ్రామస్థులు తేల్చిచెప్పారు. 

Updated Date - 2022-09-25T05:30:00+05:30 IST