Abn logo

మటన్‌ పచ్చడి

కావలసినవి : బోన్‌లెస్‌ మటన్‌ - అరకేజీ, ఉప్పు - తగినంత, పసుపు - ఒక టేబుల్‌స్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, నీళ్లు - అరకప్పు, మెంతులు - అర టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, ధనియాలు - అర టీస్పూన్‌, కారం - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - సరిపడా, నిమ్మరసం - పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు.


తయారీ : ముందుగా మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసి వేగించుకుని, మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. మటన్‌ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒకపాత్రలో మటన్‌ వేసి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి, అర కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. నీళ్లు పూర్తిగా పోయే వరకు ఉడికించాలి. తరువాత అందులోనే కొద్దిగా నూనె వేసి మటన్‌ ముక్కలు ఫ్రై కానివ్వాలి. కారం వేసి కలపాలి. పొడి చేసి పెట్టుకున్న మసాలా వేయాలి. నిమ్మరసం వేసి మరికాసేపు ఉడికించాలి. నూనె తేలే వరకు ఉడికించి దించాలి. మటన్‌ పచ్చడి అన్నం, చపాతీలోకి రుచిగా ఉంటుంది.

సేమ్యా ఉప్మాసేమ్యా దోశసేమ్యా బిర్యానీలెమన్‌ వెర్మిసెల్లీపెరుగు సేమ్యారాగి సేమ్యా నువ్వుల చిక్కీలుపిన్నిపాతిశప్త పితమకర చౌలా
Advertisement
Advertisement