ఎచ్చెర్ల ఎంపీపీపై తిరుగుబాటు

ABN , First Publish Date - 2022-08-15T05:13:59+05:30 IST

ఎచ్చెర్ల ఎంపీపీపై సొంత పార్టీ (వైసీపీ) నేతలే తిరుగు బావుట ఎగురవేశారు.

ఎచ్చెర్ల ఎంపీపీపై తిరుగుబాటు
శ్రీకాకుళంలో సమావేశమైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు :


 సమావేశమైన సొంత పార్టీ నేతలు

 ఎంపీపీ ఏకపక్ష నిర్ణయాలపై ఆగ్రహం


ఎచ్చెర్ల, ఆగస్టు 14: ఎచ్చెర్ల ఎంపీపీపై సొంత పార్టీ (వైసీపీ) నేతలే తిరుగు బావుట ఎగురవేశారు. ఎంపీపీగా ఎన్నికై ఏడాది గడుస్తున్నప్పటికీ ఎంపీటీసీ సభ్యుల సూచనలు, సలహాల ను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆయన ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, పలువురు నేతలు శ్రీకాకుళం నగరంలోని ఓ లాడ్జిలో ఆదివారం సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా జడ్పీటీసీ, రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్‌ప ర్సన్‌ బల్లాడ హేమమాలిని, పీఏసీఎస్‌ అధ్యక్షుడు సనపల నారాయణరావు, మాజీ ఎంపీపీ బల్లాడ జనార్దనరెడ్డి, మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలు భర్త, ఎచ్చెర్ల మాజీ సర్పంచ్‌ జరుగుళ్ల శంకరరావు మాట్లాడుతూ.. మండ లంలోని అన్ని గ్రామాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయించా లని డిమాండ్‌ చేశారు. ఈ నెల 17వ తేదీన జరగనున్న మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ ఏకపక్ష నిర్ణయాలతో కాకుండా మెజార్టీ సభ్యుల ఆమోదంతో అభివృద్ధి పనులను నిర్వహించాలన్నారు. అలా కాకపోతే తీవ్రంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు కింతలి ఈశ్వరరావు, మాడుగుల జగదీశ్వరరావు, బోర గోవిందరావు, కొమర సోమయ్య, సర్పంచ్‌లు అల్లు కన్నబాబు, పంచిరెడ్డి రాంబాబు, మాజీ సర్పంచ్‌ మాడుగుల మురళీధర్‌బాబా, ఏపీసీఎస్‌ మాజీ అఽధ్యక్షుడు బోర సాయిరాం, కాళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కేవీవీ సత్యనారా యణ, తదితరులు పాల్గొన్నారు. 


 


Updated Date - 2022-08-15T05:13:59+05:30 IST