ప్రజాస్వామ్య గొంతు నొక్కే ప్రక్రియ కొనసాగుతోంది : రాహుల్

ABN , First Publish Date - 2020-09-21T20:18:07+05:30 IST

రాజ్యసభ నుంచి 8 మంది సభ్యులను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్య గొంతు నొక్కే ప్రక్రియ కొనసాగుతోంది : రాహుల్

న్యూఢిల్లీ : రాజ్యసభ నుంచి 8 మంది సభ్యులను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజాస్వామ్యం గొంతును కేంద్రం నొక్కేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. బిల్లులను ప్రవేశపెట్టే ముందు రైతులను సంప్రదించలేదని, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారని మండిపడ్డారు. పార్లమెంట్ నుంచి సభ్యులను సస్పెండ్ చేయడం ప్రభుత్వ దురహంకారానికి ప్రతీక అని రాహుల్ విరుచుకుపడ్డారు.


‘‘భారత ప్రజాస్వామ్య గొంతును నొక్కేసే ప్రక్రియ కొనసాగుతోంది. మొదట సభ్యులను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత రైతు వ్యతిరేక చట్టాల్ని తీసుకొచ్చారు. మోదీ అహంకారం వల్లే దేశానికి ఆర్థిక విపత్తు వచ్చి పడింది’’ అంటూ ట్విట్టర్ వేదికగా రాహుల్ మండిపడ్డారు. 

Updated Date - 2020-09-21T20:18:07+05:30 IST