Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘దసరా’కు ముస్తాబు

యాదాద్రి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగకు  జిల్లా సిద్ధమవుతోంది. ఇప్పటికే పుట్టింటికి వచ్చిన ఆడపడుచులు, వలస వెళ్లిన వారు స్వగ్రామాలకు చేరడంతో గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్నిరకాల మార్కెట్లు వినియోగదారులతో కిక్కిరిశాయి. ఆలయాలు ముస్తాబు చేయడంతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద జమ్మిచెట్లతో పాటు రావణ దహనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పండుగ నేపథ్యంలో జిల్లాలోని హైవేలపై రద్దీ నెలకొంది. హైదరాబాద్‌- విజయవాడ, హైదరాబాద్‌-వరంగల్‌ రహదారులపై వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్‌ ప్రాం తంలో రాకపోకలు నెమ్మదిగా సాగు తున్నాయి. ఇదిలా ఉండగా బతుకమ్మ వేడుకల్లో చివరిదైన సద్దుల బతుకమ్మను గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. 

Advertisement
Advertisement