సమన్వయంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2021-02-25T05:15:21+05:30 IST

సమన్వయంతో పనిచేయాలి

సమన్వయంతో పనిచేయాలి
పరిగి: సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

పరిగి:గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సూచించారు. బుధవారం ఎంపీపీ అరవింద్‌రావు అధ్యక్షతన జరిగిన మండల సభలో  ఆయన మాట్లాడారు. గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న డంపింగ్‌యార్డులు, శ్మశానవాటికలు, రైతువేదికలు, పల్లెప్రకృతి వనాల పనులు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవింద్‌రావు, వైఎ్‌సఎంపీపీ సత్యనారాయణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ కె.శ్యాంసుందర్‌రెడ్డి, ఎంపీడీవో సుభా్‌షచందర్‌గౌడ్‌, డిఈఈలు సుబ్రమాణ్యం, సుదర్శన్‌రెడ్డి, ఏవో ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా పంచాయతీరాజ్‌ డీఈఈ సుదర్శన్‌రెడ్డి, భగీరథ డీఈఈ సుబ్రమాణ్యంతీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేపట్టినా ఎందుకు రికార్డు చేయడం లేదని రాఘవాపూర్‌,మాదారం, రూప్‌ఖాన్‌పేట్‌ సర్పంచులు జగన్‌, రాములు, నరసింహాలు ప్రశ్నించారు. 

 ఇసుక తరలింపును నిరసిస్తూ..

బషీరాబాద్‌: ఎంపీపీ కరుణఅజయ్‌ప్రసాద్‌ అధ్యక్షతన  కొనసాగిన బషీరాబాద్‌ మండల పరిషత్‌  సర్వసభ్య సమావేశం ఇసుక తరలింపుపై  వాడీవేడిగా కొనసాగింది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే కొందరు సభ్యులు మండలంలో వనరులు ఉన్నా అభివృద్ధి పనులకు, పేదల ఇళ్లకు ఇసుకను తీసుకెళ్లే పరిస్థితి లేదంటూ ఆందోళనకు దిగారు. అనంతరం ఇక్కడి ఇసుకను ఇతర ప్రాంతాలకు ఇవ్వకుండా స్థానికంగా ఇచ్చేలా ఎంపీపీ, జడ్పీటీసీ ఆధ్వర్యంలో సభ్యులు తీర్మానం చేశారు. సర్పంచ్‌గా ఎన్నికై రెండున్నరేళ్లు గడుస్తున్నా రేషన్‌కార్డు, పింఛన్‌ ఎవరికి కూడా ఇప్పించలేని దుస్థితి ఉందని కాశీంపూర్‌ సర్పంచ్‌ సి.వెంకటయ్య సమావేశంలో తన ఆవేదన వెళ్లగక్కారు. అనంతరం అధికారులు తమ శాఖల వారీగా పనితీరు, అభివృద్ధి పనుల పురోగతిపై సభలో చదివి వినిపించారు. ఈ సమావేశంలో తహసీల్దార్‌ ఎన్‌. వెంకటస్వామి, సూపరింటెండెంట్‌ వెంకట్రామ్‌గౌడ్‌, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

వాడీవేడిగా మర్పల్లి సమావేశం

మర్పల్లి :  కొందరు పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో అవినీతికి పాల్పడుతున్నారని సర్వసభ్య సమావేశంలో జడ్పీటీసీ, సభ్యులు ఆరోపించారు. బుధవారం మర్పల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ లలితరమేష్‌ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సమీక్ష నిర్వహించి సమావేశం ముగిసే సమయంలో కార్యదర్శులు వారి ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తున్నారని, సమయపాలన పాటించడం లేదని జడ్పీటీసీ మధుకర్‌ ఆరోపించారు. అంతకుముందు ఐసీడీఎ్‌సపై సమీక్ష జరుగుతుండగా మండలంలో ఏ అంగన్‌వాడీ కేంద్రం సక్రమంగా నడవటం లేదని, టీచర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని సభ్యులు ఆరోపించారు. ఇకనుంచి గ్రామపంచాయతీ బిల్లులు, తమ సమస్యలు పరిష్కరించేంత వరకు విద్యుత్‌ బిల్లులు చెల్లించేది లేదని ముక్త కంఠంతో చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మధుకర్‌, వైస్‌ఎంపీపీ మోఽహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T05:15:21+05:30 IST