నేరాల నియంత్రణకు సమష్టిగా పనిచేయాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2022-01-25T05:10:17+05:30 IST

నేరాల నియంత్రణకు సమష్టిగా పనిచేయాలి : ఎస్పీ

నేరాల నియంత్రణకు సమష్టిగా పనిచేయాలి : ఎస్పీ
నూతన ఎస్‌ఐలతో మాట్లాడుతున్న వికారాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్‌/ధారూరు, జనవరి 22: జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రతి ఒక్క పోలీస్‌ అధికారి సమష్టిగా పనిచేయాలని వికారాబాద్‌ ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి అన్నారు. ఎస్‌ఐలకు సోమవారం స్వాగతం పలుకుతూ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో భాగంగా మన జిల్లా భౌగోళిక పరిధి, 21 పోలీస్‌స్టేషన్‌ వివరాలు, సర్కిల్‌, డీఎస్పీ, డీపీవో కార్యాలయాల గురించి వివరించారు. సిబ్బందితో స్నేహపూర్వకంగా ఉండాలని, స్టేషన్‌కు వచ్చే వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా చార్జి తీసుకున్న ఎస్‌ఐలకు సూచనలు చేవారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రషీద్‌, ఎస్బీ ఎన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు, జిల్లా అధికారులు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ ధారూరు సర్కిల్‌ కార్యాలయం, పోలీసుస్టేషన్‌ను తనీఖీ చేశారు. ఆయన వెంట వికారాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణ, ధారూరు సీఐ తిరుపతిరాజు, ఎస్‌ఐ నరేందర్‌ ఉన్నారు.

Updated Date - 2022-01-25T05:10:17+05:30 IST