ఆ చెట్టును చూసి తీరాల్సిందే!

ABN , First Publish Date - 2021-06-08T05:30:00+05:30 IST

ఆ చెట్టు ఆకులు బంగారు వర్ణాన్ని తలపిస్తాయి. రాలిన ఆకులతో ఆ ప్రాంతమంతా బంగారు వర్ణంలో ధగధగా మెరిసిపోతూ ఉంటుంది. ఆ చెట్టు విశేషాలు ఇవి....

ఆ చెట్టును చూసి తీరాల్సిందే!

ఆ చెట్టు ఆకులు బంగారు వర్ణాన్ని తలపిస్తాయి. రాలిన ఆకులతో ఆ ప్రాంతమంతా బంగారు వర్ణంలో ధగధగా మెరిసిపోతూ ఉంటుంది. ఆ చెట్టు విశేషాలు ఇవి....


  1. చైనాలోని జోంగ్నాన్‌ పర్వత ప్రాంతంలో గు గునాయిన్‌ అనే బౌద్ధాలయం ఉంది. ఆ ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు ఉంది. జింగో ట్రీ అని పిలిచే ఆ చెట్టు వయస్సు 1400 ఏళ్లు. 
  2. ఆ చెట్టు ప్రత్యేకత ఏమిటంటే దాని ఆకులన్నీ బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటాయి. కొన్ని వందల ఏళ్లలో ఎన్నో వాతావరణ మార్పులను తట్టుకుని ఈ చెట్టు సజీవంగా నిలిచింది.
  3. చలికాలం ప్రారంభానికి ముందు చెట్టు ఆకులన్నీ బంగారు వర్ణంలోకి మారుతాయి. రాలిన ఆకులతో ఆ ప్రాంతమంతా బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. ఈ చెట్టు ఆకులను సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. 
  4. ఆ మనోహర దృశ్యాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. తమ కెమెరాల్లో ఆ దృశ్యాన్ని బంధించుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు.

Updated Date - 2021-06-08T05:30:00+05:30 IST