Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 29 May 2022 01:33:46 IST

అలాంటి గెలుపుతో బతకాలి

twitter-iconwatsapp-iconfb-icon

‘పాత రోమ్‌ నగరం గుర్తుందా మిత్రుడా.. ఇద్దరు గ్లాడియేటర్స్‌ తలపడతారు. ఓడినవాడు చస్తాడు, గెలిచినవాడు మాత్రమే బతుకుతాడు. అలాంటి గెలుపుతోనే బతికిఉండాలి.. చచ్చినా కూడా అలాంటి వాడి చేతిలో చచ్చామనే గర్వంతో చావాలి..’ ఈ డైలాగులు కలిగిన ‘జ్వాల’ చిత్రం టీజర్‌ను హీరో రానా దగ్గుబాటి సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రంలో ‘బిచ్చగాడు’ ఫేమ్‌ విజయ్‌ ఆంటోని, అరుణ్‌ విజయ్‌ పోటీపడి నటించారు. అక్షర హాసన్‌ కీలక పాత్రలో నటించారు. రష్యా, కజకిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, స్విట్జర్లాండ్‌, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్‌ జరిగింది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకొన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, రైమా సేన్‌, నాజర్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఫొటోగ్రఫీ: కె.ఎ.బచ్చ, సంగీతం: నటరాజన్‌ శంకరన్‌, నిర్మాతలు: జవ్వాజి రామాంజనేయులు, ఎం. రాజశేఖరరెడ్డి. దర్శకత్వం: నవీన్‌. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement