పర్షియన్ల దేశం

ABN , First Publish Date - 2020-03-12T06:25:11+05:30 IST

సియా ఖండంలో ఉన్న చిన్న దేశం ఇరాన్‌. ఈ దేశానికి పర్షియా అని కూడా పేరు. ఇక్కడ నివిసించే వారిని పర్షియన్లు ...

పర్షియన్ల దేశం

ఆసియా ఖండంలో ఉన్న చిన్న దేశం ఇరాన్‌. ఈ దేశానికి పర్షియా అని కూడా పేరు. ఇక్కడ నివిసించే వారిని పర్షియన్లు అని పిలుస్తుంటారు. దీని రాజధాని టెహ్రాన్‌. అధికార భాష పర్షియన్‌. ఈ భాషను ఫార్సి అని కూడా పిలుస్తారు. కరెన్సీ రియాల్‌. జాతీయ క్రీడ ఫ్రీ స్టయిల్‌ రెజ్లింగ్‌. ఈ క్రీడలో ఒలింపిక్‌ పతకాలు ఎప్పుడూ ఇరానే గెలుచుకుంటూ ఉంటుంది. ఐరన్‌, కాపర్‌, జింక్‌, మెగ్నీషియం, సల్ఫర్‌, క్రోమియంతో పాటు పెట్రోలియం, న్యాచురల్‌ గ్యాస్‌ ఇక్కడ ఎక్కువగా లభిస్తాయి. కార్న్‌, సోయాబీన్‌, బియ్యం, ఆటోమొబైల్‌ ఉత్పత్తులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. చమురు కోసం మొట్టమొదట ఆయిల్‌ బావిని తవ్వింది ఈ దేశంలోనే.

Updated Date - 2020-03-12T06:25:11+05:30 IST