Abn logo
Sep 20 2020 @ 04:11AM

చట్టాలపై కనీస అవగాహన ఉండాలి

Kaakateeya

జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణరావు

 (ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం)  

 చట్టాల పట్ల మహిళలు కనీస అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష్మణరావు అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని సేవాసదన్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలకు 18 సంవత్సరాలు, పురుషులకు 21 సంవత్సరాలు నిండకుండా వివాహం జరిపితే చర్యలు తీసుకుంటామన్నారు.


అక్రమంగా అబార్షన్లు చేసినా, ప్రోత్సహించినా శిక్షించడం జరుగుతుందన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే స్కానింగ్‌ సెంటర్ల లైసెన్సులు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. యాసిడ్‌, మానభంగం కేసుల్లో బాదితులు ధైర్యంగా ముందుకు వస్తే సెక్షన్‌ 357 (ఎ) ప్రకారం  నష్ట పరిహారం అందజేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలు, కార్మికులు, మహిళలకు ఉచిత న్యాయ సహాయం అంది స్తామన్నారు. న్యాయవాదులు అజ్మతున్నీసా,  ఓలేటి రమణి  వివిధ చట్టా లపై అవగాహన కల్పించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి. రాజారామ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement
Advertisement