Advertisement
Advertisement
Abn logo
Advertisement

హత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడాలి

చేవెళ్ల : మహిళలపై జరుగుతున్న హత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని దళిత స్ర్తీ శక్తి జాతీయ కన్వీనర్‌ గడ్డం ఝాన్సీ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో దళిత స్ర్తీశక్తి ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న హత్యచారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అంబేడ్కర్‌, పూలే విగ్రహాలకు పూలువేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దిళిత, గిరిజన స్ర్తీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. దళిత స్త్రీశక్తి రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ భాగ్యలక్ష్మి, సివిల్‌సప్లై జిల్లా సభ్యుడు జి.రవీందర్‌, ఎస్‌.ప్రవీణ్‌ తదితరులు ఉన్నారు. 

Advertisement
Advertisement