ఎంజీఎం సేవలపై నమ్మకం కల్పించాలి

ABN , First Publish Date - 2020-08-15T10:34:13+05:30 IST

కొవిడ్‌ చికిత్స పట్ల ఎంజీఎంపై ప్రజలకు నమ్మకం కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వైద్య, ఆరోగ్య

ఎంజీఎం సేవలపై నమ్మకం కల్పించాలి

600 బెడ్స్‌తో కొవిడ్‌ చికిత్సకు ప్రణాళిక

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

 

హన్మకొండ టౌన్‌, ఆగస్టు 14: కొవిడ్‌ చికిత్స పట్ల ఎంజీఎంపై ప్రజలకు నమ్మకం కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. శుక్రవారం హన్మకొండలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సలో కొవిడ్‌ చికిత్సపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ఎంజీఎం, పీఎంఎ్‌సఎ్‌సవై సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి   కలిపి 600 బెడ్స్‌ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. పీఎంఎ్‌సఎ్‌సవై ఆస్పత్రిలో 106 బెడ్స్‌ను 20 రోజుల్లో అందుబాటులో తేనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఎంజీఎంలో 250 బెడ్స్‌ కొవిడ్‌ చికిత్స కోసం అందుబాటులో ఉన్నాయన్నారు. ఎంపీ (రాజ్యసభ) నిధులతో పరీక్షలు నిర్వహించే పరికరాలు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. 5వేల పీపీఈ కిట్లు, 20వేల ఎన్‌-95 మాస్కులు అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు.  అవసరమైన సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. 


 కేంద్ర నిధులతో కేఎంసీలో చేపట్టిన ఆస్పత్రి పనులు ఈనెల 24 వరకు పూర్తి అయ్యేలా చూడాలని మంత్రి కేఎంసీ ప్రిన్సిపాల్‌కు సూచించారు. ప్రతి రోజు ఎంజీఎంలో కోవిడ్‌ చికిత్సకు సంబంధించిన బులెటిన్‌ వెల్లడించాలని ఆదేశించారు. కొవిడ్‌ చికిత్స కోసం ఎంజీఎంకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం జరిగిందని, అవసరమైతే మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌, ఎంపీ బండా ప్రకాశ్‌, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌, నగర పాలకసంస్థ కమిషనర్‌ పమేలా సత్పతి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్‌, మేయర గుండా ప్రకాశ్‌, కేఎంసీ ప్రిన్సిపాల్‌ డా.సంధ్య, ఎంజీఎం సూపరింటెండెంట్‌  నాగార్జునరెడ్డి, ఆర్‌డీవో వాసుచంద్ర, అడిషనల్‌ డీఎంఅండ్‌హెచ్‌వో డా.మధన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-15T10:34:13+05:30 IST