వడగాడ్పులతో అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-03-28T10:10:24+05:30 IST

ప్రస్తుత వేసవిలో వడగాడ్పులు అధికంగా ఉన్నాయని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండేలా ముందస్తు

వడగాడ్పులతో అప్రమత్తంగా ఉండాలి

కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి 


కాకినాడ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత వేసవిలో వడగాడ్పులు అధికంగా ఉన్నాయని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్‌, పంచాయతీ అధికారులను కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం క్షేత్రస్ధాయి అధికారులతో ఈ అంశంపై ఆయన వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. మే నెలాఖరు వరకు వడగాల్పులు ఉంటాయని సమాచారం ఉన్నందున తగిన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. డీఆర్వో సత్తిబాబు మా ట్లాడుతూ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లో సన్‌స్ట్రోక్‌కు గురైన వ్యక్తులు బీమా పథకంలోకి రారని, అందువల్ల వారిని మరోపథకంలో లబ్ధిపొందేలా చూస్తామని తెలిపారు. డీఎంహెచ్‌వో సత్యసుశీల మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో సన్‌స్ట్రోక్‌ గదులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎండబారిన పడినవారికి అత్యవసర చికిత్స అవసరమైతే కాకినాడ జీజీహెచ్‌కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.


తాగునీటి ఎద్దటి లేకుండా చర్యలు చేపట్టాలి

 వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా పెండింగ్‌లో ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన ఈ అంశంపై క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు.


తాగునీరు సరఫరాకు సీపీడబ్ల్యూఎస్‌ స్కీమ్స్‌ 62, సీపీడబ్ల్యూఎస్‌ స్కీమ్స్‌-1738, ఎంపీడబ్ల్యూఎస్‌ స్కీమ్‌-553, డైరెక్ట్‌ పంపింగ్‌ 84, చేతిపంపులు 12181, ఆర్వో ప్లాంట్లు 232ఉన్నాయని.. వీటన్నింటినీ క్షేత్రస్థాయి అధికారులతో పాటు డివిజన్‌స్థాయి అధికారులు పర్యవేక్షించాలన్నారు.


తాగునీటి అవసరాల నిమిత్తం రూ.18కోట్లు ఉన్నాయని, పాత బకాయిల విషయంలో కాంట్రాక్టర్ల కు భరోసా కల్పించి పనులు పూర్తి చేయించాలనిఇంజనీర్లకు సూచించారు. ప్రతి చేతిపంపు మరమ్మతుల కోసం రూ.1000మంజూరు చేస్తామన్నారు. చెరువులు శుభ్రంగాఉండేలా అధికారు పర్యవేక్షణఉండాలన్నారు.

Updated Date - 2020-03-28T10:10:24+05:30 IST