Abn logo
Jun 5 2020 @ 05:03AM

అప్రమత్తంగా ఉండాలి

మైలవరం, జూన్‌ 4 : కరోనా వైరస్‌ నియంత్రణలో ప్రజలు, విధుల్లో ఉన్న ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ పిలుపునిచ్చారు. మైలవరం మండల పరిధిలోని రెడ్‌జోన్‌లో ఉన్న నవాబుపేటలో గురువారం ఎస్పీ పర్యటించారు. గ్రామంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20కి చేరడంతో విధుల్లో ఉన్న పోలీస్‌ అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. రెడ్‌జోన్‌లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ రెడ్‌జోన్‌లోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, వారికి అవసరమైన నిత్యావసర సరుకులను ఇళ్లవద్దకే పంపిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు. ప్రజలు అత్యవసరమై బయటకు వెళ్లేటప్పుడు మాస్క్‌లు, గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో  జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, రూరల్‌ సీఐ మంజునాధరెడ్డి, ఎస్‌ఐలు ప్రవీణ్‌కుమార్‌, ధనుంజయుడు పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement