Abn logo
Oct 27 2021 @ 00:52AM

ఈ-నామ్‌ పద్ధతిలోనే కొనుగోలు చేయాలి

మిర్చి తూకాలను పరిశీలిస్తున్న డీడీ లావణ్య

మార్కెటింగ్‌ శాఖ డీడీ లావణ్య

హిందూపురం, అక్టోబరు 26: మార్కెట్‌ యా ర్డుకు రైతులు తీసుకొచ్చే ఉత్ప త్తులను ఈ-నామ్‌ పద్ధతిలోనే కొనుగోలు చేయాలనీ, లేదంటే చర్యలు తప్పవని మార్కెటింగ్‌ శాఖ డీడీ లావణ్య హెచ్చరించారు. మంగళవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఎండు మిర్చి కొనుగోళ్లను ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్కెట్‌ యార్డుకు పంట ఉత్పత్తులను విక్రయానికి తీసుకువచ్చే రైతుకు గిట్టుబాటు ధర, కొనుగోళ్లలో పారదర్శకత తీ సుకువచ్చేందుకు ప్రభుత్వం ఈ-నామ్‌ ప్రవేశపెట్టిందన్నారు. చేతివేలం ని ర్వహిస్తే మార్కెట్‌లో ట్రేడర్లు, కమీషన ఏజెంట్ల లైసెన్స రద్దు చేస్తామని హెచ్చరించారు. యార్డులకు ఆదాయం తెచ్చేందుకు రీజనల్‌ పరిధిలోని 32 మా ర్కెట్‌ యార్డుల్లో పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు ప్రతి పాదన చేశామన్నారు. సమావేశంలో మార్కెట్‌ యార్డు చైర్మన కొండూరు మల్లికార్జున, కార్యదర్శి నారాయణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.