Abn logo
Nov 29 2020 @ 01:05AM

చోరీలకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదు

బంగారు గొలుసు దొంగను పట్టుకున్నాం ఫ డీఎస్పీ ఉపేంద్రరెడ్డి

లక్ష్మణచాంద, నవంబరు 28 : చోరీలకు పాల్పడిన వారికి కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఉపేంద్ర రెడ్డి అన్నారు. స్తానిక పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 24న మధ్యాహ్నం 12 గంటలకు రాచాపూర్‌ గ్రామంలో లక్ష్మీ అనే మహిళ మెడలోంచి బంగారు గొలుసు దొంగిలించిన దండుగుల రాజేష్‌ను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. రాజేష్‌ జగిత్యాల జిల్లా ఇబ్రహీం పట్నం గ్రామ నివాసి అని బంగారు గొలుసుల దొంగతనానికి అలవాటు పడ్డాడని తెలిపారు. పల్సర్‌ బైక్‌పై తిరుగుతూ ఈ దొంగతనాలకు పాల్పడుతున్న విషయం విచారణలో వెల్లడైందని వివరించారు. మండలంలోని బోరిగాం వద్ద వాహనతనిఖీ నిర్వ హిస్తుండగా మామడ ఎస్సై వినయ్‌కుమార్‌ పట్టుకున్నాడని తెలిపారు. అతి త్వరగా కేసును ఛేదించి దొంగను పట్టుకున్నందున విజయ్‌ని అభి నందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ జీవన్‌రెడ్డి, ఎస్సై వినయ్‌ కుమార్‌,  పోలీస్‌ కానిస్టేబుల్‌ భరత్‌, తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement