వెసక్టమి అవగాహన పెంచుకోవాలి

ABN , First Publish Date - 2020-11-29T06:22:08+05:30 IST

వెసక్టమి అవగాహన పెంచుకోవాలి

వెసక్టమి అవగాహన పెంచుకోవాలి
హద్‌గాంలో వైద్య పరీక్షలు చేస్తున్న దృశ్యం

మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వేదవ్యాస్‌

నర్సాపూర్‌(జి), నవంబరు 27: కుటుంబ నియంత్రణలో భాగంగా వేసెక్టమీపై పురుషులు అవగాహన పెంచుకోవాలని మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వేదవ్యాస్‌ సూచించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ అనేది ఒక మహిళలకు మాత్రమే కాదని పురుషులు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయించుకోవచ్చని తెలిపారు. మహిళల కంటే పురుషులకే త్వరగా ఈ ప్రక్రియ పూర్తవడంతో పాటు ఎలాంటి కోత లేకుండా ఆపరేషన్‌ నిర్వహించ బడుతుందని తెలిపారు.  ఆపరేషన్‌ చేస్తే బలహీనంగా తయారవుతామని ఏ పని చేసుకోలేమనే అపోహను వీడనాడి వేసెక్టమికి పురుషులు ముందుకు రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఫ హద్‌గాంలో కరోనా పరీక్షలు

ముప్పై పడకల ఆసుపత్రి పరిధిలోని లోకేశ్వరం మండలంలోని హద్‌గాం శనివారం నలభై నాలుగు కరోనాటెస్టులు చేసినట్లు డాక్టర్‌ వేదవ్యాస్‌ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నర్సాపూర్‌ జి మండలంలో గల ముప్పై పడకల ఆసుపత్రి పరిధిలో లోకేశ్వరం మండలంతో పాటు సారంగాపూర్‌ మండలంలో గల  సబ్‌ సెంటర్లలలో విధులు నిర్వహౄసిస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు.కరోనా సమయంలో మూడు మండలాల్లో తమ సేవలు అందిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో హెల్త్‌ అసిస్టెంట్లు రమణరెడ్డి, శుభచరణ్‌, ఆశాలు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T06:22:08+05:30 IST