ఆటలతో అనునయించాలి!

ABN , First Publish Date - 2021-03-07T05:30:00+05:30 IST

చిన్న పిల్లలు ఒక్క చోట కుదురుగా ఉండరు. ఇంట్లో వారిని పట్టుకోవడం,, వారి అల్లరిని అదుపు చేయడం కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుంది

ఆటలతో అనునయించాలి!

చిన్న పిల్లలు ఒక్క చోట కుదురుగా ఉండరు. ఇంట్లో వారిని పట్టుకోవడం,, వారి అల్లరిని అదుపు చేయడం కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుంది. అయితే వారిని ఆటలు, కొన్ని పనుల్లో భాగం చేస్తే శారీరకంగా, మానసికంగా చురుకుగా ఎదుగుతారు.   వేళకు చక్కగా నిద్రపోతారు. అందుకు ఏమేం చేయాలంటే....


డ్యాన్స్‌: చిన్నపిల్లలు తడబడుతూ నడిచినా, అటూ ఇటూ కదిలినా డ్యాన్స్‌ చేసినట్టే ఉంటుంది. ఎగ్జయిటింగ్‌ లేదా బాగా పాపులర్‌ పాట వినిపిస్తే వాళ్లు తమకు వచ్చిన స్టెప్పులు వేస్తారు. 


దాగుడుమూతలు: పిల్లలతో కాసేపు దాగుడుమూతలు ఆడాలి. ఈ సరదా ఆటతో వారికి శారీరక వ్యాయామం చేసినట్టవుతుంది. అయితే వారు ఎక్కడ దాక్కుంటున్నారనేది మీరు కనిపెడుతూ ఉండాలి. 


యోగా: చిన్న వయసులోనే పిల్లలకు యోగా అలవాటు చేయాలి. వారితో తేలికపాటి స్ట్రెచింగ్‌, శ్వాస సంబంధ వ్యాయామాలు చేయించాలి. ఇవి పిల్లలను ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతాయి.


ఆటలు:  ఏదైనా వస్తువు లేదా బొమ్మ విడి భాగాలను వారికి ఇచ్చి, వాటిని చక్కగా పేర్చమని చెప్పాలి. 

Updated Date - 2021-03-07T05:30:00+05:30 IST