ఎన్‌ఆర్‌ఈజీఎస్‌పై అవగాహన ఉండాలి

ABN , First Publish Date - 2021-01-25T05:25:35+05:30 IST

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ సూచించారు. వర్ని మండల పరిషత్‌ కార్యాలయంలో ఆదివారం ఉపాధిహామీ పథకం అమలుపై సమీక్షించారు.

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌పై అవగాహన ఉండాలి

వర్ని, జనవరి 24 : ఎన్‌ఆర్‌ఈజీఎస్‌పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ సూచించారు. వర్ని మండల పరిషత్‌ కార్యాలయంలో ఆదివారం ఉపాధిహామీ పథకం అమలుపై సమీక్షించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులు ఎంత వరకు ప్రగతి సాఽ దించాయన్న విషయాన్ని సంబంధిత శాఖ సిబ్బంది అధ్యయనం చేస్తూ ఏ యే పనులకు ఎంత నిధులు సమకూర్చారో రికార్డుల్లో చూపాలని సూచిం చారు. గ్రామాల్లో ఉపాధిపై సామాజిక తనిఖీ ఉంటుందని, ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పనులు పురోగతికి చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి పనుల పర్యవేక్షణకు కేంద్ర బృందం పర్యటించనుందని అందుకు బృందం అధికారులకు తగిన సూచనలిచ్చే విధంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో బషీరుద్దీన్‌, ఎంపీవో చందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-25T05:25:35+05:30 IST