Advertisement
Advertisement
Abn logo
Advertisement

చట్టాలు, హక్కులపై అవగాహన ఉండాలి

: జిల్లా ఎస్పీ డాక్టర్‌ కాగినెల్లి ఫక్కీరప్ప

నార్పల,నవంబరు30 : రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, చ ట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్‌ కా గినెల్లి ఫక్కీరప్ప పేర్కొన్నారు. మండల పరిధిలోని గూగూడు ఎస్సీ కాలనీలో మంగళవారం ఏర్పాటు చేసిన పౌరహక్కుల దినోత్సవానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లా డుతూ... జిల్లా వ్యాప్తంగా స్థానిక అధికారులు సమష్టిగా ప్రతినెల చి వరి రోజున పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలని ఆదేశించా రు. ఇంటింటికి వెళ్లి సమస్యలను గుర్తించాలన్నారు. ముఖ్యంగా మ హిళల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలన్నారు. ప్రతి పిల్ల వాడిని పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాజ్యాం గం కల్పించిన చట్టాలు, హక్కుల గురించి తెలుసుకొని అందుకు అ నుగుణంగా ప్రజలు జీవించాలన్నారు. ఏవైనా సమస్యలుంటే అర్జీ రూపంలో తన దృష్టికి తీసుకురావాలన్నారు.  కార్యక్రమంలో డీఎస్పీ వీరరాఘవరెడ్డి, ఇటుకలపల్లి సీఐ విజయభా స్కర్‌గౌడ్‌, తహసీల్దార్‌ శ్రీధర్‌, ఎస్‌ఐ వెంకటప్రసాద్‌, జిల్లా సంక్షేమా ధికారి శివగురుప్రసాద్‌, ఈఓఆర్డీ లక్ష్మీనరసింహ, ఆర్‌ఐ లక్ష్మీపతి రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రాజారెడ్డి, కో-ఆప్షన సభ్యులు సాబీరా, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

రాప్తాడు: ఎస్సీ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తహసీల్దార్‌ ఈరమ్మ, ఎంపీడీఓ సాల్మనరాజ్‌, ఎస్‌ఐ రాఘవరెడ్డి తెలిపారు. మండలంలోని గొళ్లపల్లి ఎస్సీ కాలనీలో మంగళవారం పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. కాలనీలో పరిశీలించారు. సమస్యలుంటే వెంటనే పరిష్కరిస్తామన్నారు. ప్రజలు చట్టాలు, హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement