వారంలో 90 శాతం పూర్తవ్వాలి

ABN , First Publish Date - 2021-10-20T05:00:17+05:30 IST

జిల్లాలో వారంలోపు 90 శాతం వ్యాక్సి నేషన్‌ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు అధికారులను ఆదే శించారు

వారంలో 90 శాతం పూర్తవ్వాలి
హన్వాడ పీహెచ్‌సీలో రికార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకట్రావు

- కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై కలెక్టర్‌ ఆదేశం


హన్వాడ, అక్టోబరు 19 : జిల్లాలో వారంలోపు 90 శాతం వ్యాక్సి నేషన్‌ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు అధికారులను ఆదే శించారు. కలెక్టర్‌ హన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవా రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాక్సిన్‌ శాతాన్ని, ఆసుపత్రి రికార్డు లను పరిశీలించారు. వ్యాక్సిన్‌ శాతాన్ని పెంచాలని సూచించారు. 18 ఏళ్లు పైబడిన వారందరికి 100 శాతం వ్యాక్సిన్‌ ఇవ్వాలని వైద్య సిబ్బం దిని ఆదేశించారు. వ్యాక్సిన్‌ తీసుకోని వారిని గుర్తించి వారందరికీ ఇ వ్వాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీవో ధనుంజయ గౌడ్‌, ఎంపీవో వెంకట్‌రెడ్డి, కార్యదర్శివెంకటయ్య,సిబ్బంది పాల్గొన్నారు.


వ్యాక్సినేషన్‌ త్వరగా పూర్తి చేయాలి


మహమ్మదాబాద్‌ : వ్యాక్సినేషన్‌ ప్రక్రియను తర్వగా పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకట్రావు ఆదేశించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలో ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ తీసుకున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్‌ తీసుకునేం దుకు సిద్ధంగా లేని వారి వివరాలను సిబ్బందిని  అడిగి తెలుసుకున్నారు.  అంగన్‌వాడీ టీచర్లు ఈ ప్రక్రియలో విధిగా పాల్గొనాలని ఆదేశించారు. బీఎల్‌ఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, వీఆర్‌ఏలు, ఏఎన్‌ఎంలు ఆశ కార్యక ర్తలతో 20న ఎంపీడీవో సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు సమావేశం నిర్వహించాలన్నారు. కలెక్టర్‌ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కృష్ణ, డాక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:00:17+05:30 IST