Muslim బాలికలు 16 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవచ్చు...హైకోర్టు సంచలన తీర్పు

ABN , First Publish Date - 2022-06-20T16:23:16+05:30 IST

బాలికల పెళ్లి విషయంలో పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది....

Muslim బాలికలు 16 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవచ్చు...హైకోర్టు సంచలన తీర్పు

చండీఘడ్: ముస్లిం(Muslim) బాలికల పెళ్లి విషయంలో పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఒక ముస్లిం అమ్మాయికి 16 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు ఆమె ఇష్టానుసారం వివాహం చేసుకోవచ్చని పంజాబ్, హర్యానా హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పులో పేర్కొంది. కోర్టు తన తీర్పులో ఇస్లామిక్ చట్టాన్ని ఉదహరించింది.షరియా చట్టం ప్రకారం పురుషులు, మహిళలు 15 సంవత్సరాల వయస్సులో పెద్దలుగా పరిగణిస్తారు. ఈ కేసులో అబ్బాయికి 21 ఏళ్లు కాగా, అమ్మాయికి 16 ఏళ్లు.పఠాన్‌కోట్‌కు చెందిన ముస్లిం దంపతుల పిటిషన్‌ పంజాబ్‌, హరియాణా హైకోర్టులోని జస్టిస్‌ జస్జిత్‌ సింగ్‌ బేడీ కోర్టులో విచారణకు వచ్చింది. రెండు వారాల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట తమకు రక్షణ కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించింది.


ఈ జంట జూన్ 8వతేదీన ఇస్లామిక్ పద్ధతుల ప్రకారం వివాహం చేసుకున్నారు, అయితే వారి కుటుంబాలు ఆ పెళ్లిని వ్యతిరేకించాయి.కొత్త దంపతులను వారి కుటుంబసభ్యులు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో నవ వధూవరులు హైకోర్టును ఆశ్రయించారు.జస్టిస్ బేడీ తన తీర్పులో ముస్లిం వ్యక్తిగత చట్టంపై దిన్షా ఫర్దూన్ జీ ముల్లా యొక్క పుస్తకాన్ని ఉదహరించారు. నూతన దంపతులకు సరైన భద్రత కల్పించాలని పఠాన్‌కోట్ ఎస్‌ఎస్పీని హైకోర్టు జస్టిస్ బేడీ ఆదేశించారు. ఎందుకంటే వారు ఇష్టానుసారం వివాహం చేసుకున్నందున వారి ప్రాథమిక హక్కులను తిరస్కరించలేమని హైకోర్టు జస్టిస్ తన తీర్పులో పేర్కొన్నారు.


Updated Date - 2022-06-20T16:23:16+05:30 IST