Abn logo
Oct 28 2020 @ 16:21PM

ఫ్రాన్స్‌ను బాయ్‌కాట్ చేయాలంటున్న ముస్లింలు

Kaakateeya

ఇస్లాంను విమర్శిస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా మాక్రోన్‌పై ముస్లింల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తమ ఇస్లాం గురించి, మహ్మద్ ప్రవక్త గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చిరిస్తున్నారు. ఇస్లాంను, మహ్మద్ ప్రవక్తను ఫ్రాన్స్‌ గౌరవిస్తే.. ముస్లింలు కూడా ఆ దేశాన్ని గౌరవిస్తారని, అలా కాదని తప్పుగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా మహ్మద్ ప్రవక్త ఎంతో గొప్పవ్యక్తని, అతడు మానవత్వానికి ప్రతిరూపమని, అలాంటి వ్యక్తిని ఫ్రాన్స్ దూషించడం క్షమించరాని నేరమని ఆగ్రహిస్తున్నారు. ఈ క్రమంలోనే #ProphetOfHumanity అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విటర్‌లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. గంటల వ్యవధిలోనే ఈ హ్యాష్‌ట్యాగ్‌పై వేల సంఖ్యలో ట్వీట్లు పోస్టయ్యాయి.

Advertisement
Advertisement