Madhya Pradesh: ఆధార్ తీసుకురాలేదని ముస్లిం వ్యాపారిపై ఆగంతకుల దాడి

ABN , First Publish Date - 2021-08-27T18:14:57+05:30 IST

ఆధార్ కార్డు తీసుకురాలేదని ఓ ముస్లిమ్ వీధి వ్యాపారిని ఇద్దరు గ్రామస్థులు కొట్టిన ఘటన...

Madhya Pradesh: ఆధార్ తీసుకురాలేదని ముస్లిం వ్యాపారిపై ఆగంతకుల దాడి

భోపాల్ : ఆధార్ కార్డు తీసుకురాలేదని ఓ ముస్లిమ్ వీధి వ్యాపారిని ఇద్దరు గ్రామస్థులు కొట్టిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా జరిగింది. దేవాస్ లోని అమలాటాజ్ గ్రామానికి చెందిన జాహిద్ (45) అనే వ్యాపారి బిస్కెట్లు విక్రయించడానికి బోర్లి గ్రామానికి వచ్చాడు. గ్రామస్థులు ఇద్దరు జాహిద్ ను ఆధార్ కార్డు చూపించమని అడిగారు. బాధితుడు జాహిద్ తన వద్ద ఆధార్ లేదని చెప్పడంతో గ్రామస్థులు అతన్ని కొట్టారు. జాహిద్ కు చేతులు, కాళ్లపై గాయాలయ్యాయి. బిస్కెట్లు అమ్మటానికి గ్రామంలోకి రావద్దని వారు హెచ్చరించారని జాహిద్ పోలీసులుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ 294, 323,506,34 ల కింద కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం ఇండోర్ లో గాజుల వ్యాపారిపై కొందరు దాడి చేసి నిర్ధాక్షిణ్యంగా కొట్టారు. 


Updated Date - 2021-08-27T18:14:57+05:30 IST