Maharastra లో Muslim మతపెద్ద కాల్చివేత.. అఫ్ఘనిస్తాన్ పౌరుడిగా గుర్తింపు

ABN , First Publish Date - 2022-07-06T17:52:22+05:30 IST

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ముస్లిం(Muslim) మతపెద్ద హత్యకు గురయ్యాడు. నాసిక్ జిల్లా యోలా పట్టణంలో నలుగురు దుండగులు తుపాకీతో కాల్చిచంపారని

Maharastra లో Muslim మతపెద్ద కాల్చివేత.. అఫ్ఘనిస్తాన్ పౌరుడిగా గుర్తింపు

ముంబై : మహారాష్ట్ర(Maharastra)లోని నాసిక్ జిల్లాలో ముస్లిం(Muslim) మతపెద్ద హత్యకు గురయ్యాడు. నాసిక్ జిల్లా యోలా(Yeola) పట్టణంలో నలుగురు దుండగులు తుపాకీతో కాల్చిచంపారని పోలీసులు వెల్లడించారు. ఈ హత్యకు గల కారణం ఏమిటో తెలియరాలేదని వెల్లడించారు. బాధితుడు అఫ్ఘనిస్తాన్‌(Afghanistan)కు చెందిన 35 ఏళ్ల ఖ్వాజా సయ్యద్ చిస్తీ (Khwaja Sayyad Chishti) గా గుర్తించామని, ఇతడిని స్థానికంగా ‘సూఫీ బాబా’గా పిలుస్తారని అధికారులు తెలిపారు. ముంబై నగరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉండే యోలా(Yeola) పట్టణంలోని ఎంఐడీసీ ఏరియాలో బహిరంగ ప్రదేశంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని వెల్లడించారు.


నుదుటిపై కాల్చడంతో ఖ్వాజా చిస్తీ అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం ఖ్వాజా వినియోగించే ఎస్‌యూవీ వాహనంలోనే దుండగులు పరారయ్యారని పోలీసు అధికారులు వివరించారు. ఈ మేరకు యోలా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. హంతకుల కోసం వేట కొనసాగుతోందని చెప్పారు.

Updated Date - 2022-07-06T17:52:22+05:30 IST