మతసామరస్యానికి జిల్లా ప్రతీక

ABN , First Publish Date - 2021-01-26T05:54:50+05:30 IST

మత సామరస్యానికి జిల్లా ప్రతీక అని, కులమతాల కతీతంగా కలిసి ఉండాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు.

మతసామరస్యానికి జిల్లా ప్రతీక
మసీదు, చర్చి, ఆలయాల మత పెద్దలకు చెక్కులు అందజేస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప

  1.  మత పెద్దలతో ఎస్పీ ఫక్కీరప్ప 


కర్నూలు, జనవరి 25: మత సామరస్యానికి జిల్లా ప్రతీక అని, కులమతాల కతీతంగా కలిసి ఉండాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు. జిల్లా పోలీస్‌ కార్యాల యంలోని ఎస్పీ చాంబర్‌లో ఆలయ, మసీదు, చర్చిల పెద్దలతో సోమవారం ఆయన సమావేశం అయ్యారు. ఆలయాలు, మసీదులు, చర్చిలకు రూ.10వేల చొప్పున చెక్కు లను విరాళంగా మత పెద్దలకు అందజేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర మంది రానికి రూ.10 వేలు, కర్నూలు సీఎస్‌ఐ చర్చికి రూ.10 వేలు, కర్నూలు ఏక్యూఎస్‌ఏ మసీదుకు రూ.10 వేలు ఇచ్చారు. అనంతరం ఎస్పీని మతపెద్దలు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ మహేశ్వరరెడ్డి, టూటౌన్‌ సీఐ పార్థసారథిరెడ్డి, ఎస్పీ పీఏ నాగరాజు, జిల్లా ఖాజీ ఎండీ అబ్దుస్‌ సలామ్‌ కౌసర్‌, సీఎస్‌ఐ సంఘ కాపర్లు ఎంఐడీ ప్రసాదరావు, సంజయ్‌ మధు, విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడే నందిరెడ్డి సాయిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమిశెట్టి వెంకటరామయ్య, విజేయుడు, మహేష్‌, గోరంట్ల రమణ, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-26T05:54:50+05:30 IST