తబ్లీగీ ఉదంతం: ముస్లిం వర్గానికి ముస్లిం ఐఏఎస్ ఐపీఎస్‌ల వినతి

ABN , First Publish Date - 2020-04-06T03:56:19+05:30 IST

తబ్లీగీ ఉందతం కారణంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ముస్లింలు సామాజిక దూరం నిబంధనలు పాటించడం లేదనే భావన ప్రబలుతోందని భావించిన 80 ముస్లిం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్లకు ఓ బహిరంగ వినతి చేశారు.

తబ్లీగీ ఉదంతం: ముస్లిం వర్గానికి ముస్లిం ఐఏఎస్ ఐపీఎస్‌ల వినతి

న్యూఢిల్లీ: తబ్లీగీ ఉందతం కారణంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో ముస్లింలు సామాజిక దూరం నిబంధనలు పాటించడం లేదనే భావన ప్రబలుతోందని భావించిన 80 ముస్లిం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి ముఖ్య విన్నపం చేశారు. ప్రభుత్వం ఏర్పరిచిన నిబంధనలను ముస్లిందరూ తూచా తప్పకుండా పాటించాలని, కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని ఇతరులు నిందించే అవకాశం కల్పించొద్దని వారు కోరారు.  ప్రభుత్వం విధించిన నిబంధనలకు మతపరమైన నియమాలకు అతీతంగా అందరూ బద్ధులై ఉండాలని వారు పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు ఓ బహిరంగ లేఖ రాశారు.

Updated Date - 2020-04-06T03:56:19+05:30 IST