వాషింగ్టన్: America అధ్యక్షుడు Joe Biden పై ప్రపంచ కుబేరుడు ఊహించని వ్యాఖ్యలు చేశారు. బైడెన్ కొంచెం తగ్గండి అంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయియ. అమెరికాని ఏదో ఉద్దరించడానికి ఎన్నికయ్యాయని బైడెన్ భావిస్తుంటారని, వాస్తవానికి అంతలా ఫీలవ్వాల్సిన అవసరం లేదని, కొంచెం తగ్గించడంటూ చురకలు అంటించారు. Donal Trump Twitter ఖాతాపై విధించిన నిషేధం ఎత్తివేతపై స్పందించిన రెండు రోజుల అనంతరం బైడెన్‌పై ఈ విధంగా స్పందించడం చర్చనీయాంశమైంది. శుక్రవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘బైడెన్ చేసిన తప్పేంటంటే.. తానేదో దేశాన్ని ఉద్దరించడానికి ఎన్నికైనట్లు ఆయన భావిస్తున్నారు. కానీ అక్కడ అంతగా ఫీలవ్వాల్సిన అవసరం లేదు’’ అని మస్క్ ట్వీట్ చేశారు. మే 12న అమెరికా ఎన్నికలు, ట్రంప్‌పై నిషేధం గురించి మస్క్ స్పందిస్తూ.. ‘‘వచ్చే 2024 ఎన్నికల నాటికి ట్రంప్ కంటే తక్కువ విభజనకారి ఉండడం మంచిదే. అలా అని ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై నిషేధం అక్కర్లేదు’’ అని ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి