జాతీయస్థాయి సాఫ్ట్‌ టెన్నీస్‌ పోటీలకు కస్తూరి ఎంపిక

ABN , First Publish Date - 2021-01-25T05:06:11+05:30 IST

జాతీయస్థాయి సాఫ్ట్‌టెన్నీస్‌ పోటీలకు పెద్దలోగిడి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని గురాడి కస్తూరి ఎంపికైనట్లు సాఫ్ట్‌ టెన్నీస్‌ క్రీడా సంఘ అధ్యక్షుడు శ్రీరాం రమణ ఉపాధ్యక్షుడు దుర్గాప్రసాద్‌ తెలిపారు.

జాతీయస్థాయి సాఫ్ట్‌ టెన్నీస్‌ పోటీలకు కస్తూరి ఎంపిక
కస్తూరిని అభినందిస్తున్న సంఘ ప్రతినిధులు


పాతపట్నం: జాతీయస్థాయి సాఫ్ట్‌టెన్నీస్‌ పోటీలకు పెద్దలోగిడి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని  గురాడి కస్తూరి ఎంపికైనట్లు సాఫ్ట్‌ టెన్నీస్‌ క్రీడా సంఘ అధ్యక్షుడు శ్రీరాం రమణ ఉపాధ్యక్షుడు దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఈనెల 22, 23 తేదీల్లో విజయవాడలో జరిగిన సెకెండ్‌ ఏపీ అంతరరాష్ట్ర సాఫ్ట్‌టెన్నీస్‌ పోటీలలో సీనియర్‌ విభాగం నుంచి కస్తూరి పాల్గొని విశేష ప్రతిభ కనబరిచి జాతీయ పోటీలకు ఎంపికైందన్నారు. మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 8 వరకు జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రం శ్రీనగర్‌లో జరగనున్న పోటీల్లో పా ల్గొంటుందన్నారు. ఆమెను సంఘ ప్రతినిధులు షణ్ముఖ రావు,  కె.వెంకట రావు, పీడీ, పీఈటీలు ఎన్ని శేఖర్‌ బాబు, జె.కృష్ణ అభినందించారు.

 

 

Updated Date - 2021-01-25T05:06:11+05:30 IST