Jul 3 2021 @ 14:04PM

‘అణ్ణాత్త’ పోస్టరులో సంగీత దర్శకుడి పేరు మిస్సింగ్‌

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'అణ్ణాత్త'. శివ దర్శకత్వంలో కళానిధి మారన్‌ నిర్మాతగా సన్‌ పిక్చర్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో కీర్తిసురేష్‌, మీనా, ఖుష్బూ, ప్రకాష్‌ రాజ్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.ఈ యేడాది దీపావళి సందర్భంగా నవంబర్‌ 4న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దానికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. అయితే, తాజాగా విడుదల చేసిన పోస్టరులో చిత్ర సంగీత దర్శకుడు ఇమాన్‌ పేరు వేయడం మరిచారు. తమిళ చిత్ర పరిశ్రమలోని స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లలో ఒకరైన ఇమాన్‌ పేరు పోస్టరులో ఉద్దేశపూర్వకంగా మిస్‌ చేశారా? లేదా పొరపాటున జరిగిందా? అన్నది తెలియలేదు. అదేసమయంలో ఈ పేరు మిస్సింగ్‌పై ఇటు ఇమాన్‌ లేదా అటు నిర్మాణ సంస్థ స్పందించలేదు.