Abn logo
Mar 29 2020 @ 22:51PM

చిరు, నాగ్, వరుణ్, సాయితేజ్‌లతో కరోనాపై కోటి పాట

కరోనా గురించి భయపడవద్దు.. అలాగని అశ్రద్ద వహించవద్దు అంటూ.. మెగాస్టార్ చిరంజీవి ఎన్నో విధాలుగా అందరినీ హెచ్చరిస్తున్నారు. ఒక్క చిరంజీవే కాదు సెలబ్రిటీలందరూ ఈ విషయంలో తమ వంతు కర్తవ్యం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు అందరూ సపోర్ట్ చేయండి అంటూ వేడుకుంటున్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా తమ సినీ కుటుంబంలో కూడా ఎవరూ ఈ కష్టకాలంలో ఇబ్బందులు పడకూడదని ఓ చారిటీ సంస్థను నెలకొల్పారు. మెగాస్టార్ అధ్యక్షతన రూపుదిద్దుకున్న ఈ సంస్థకు ‘కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం’ అనే పేరు పెట్టారు. ఈ సంస్థకు ఇప్పుడు సెలబ్రిటీలంతా విరాళాలు ప్రకటించి, ప్రతిరోజు తమకోసం ఎంతో కష్టపడే వారందరినీ ఆదుకోవడం ఇప్పుడు తమ బాధ్యత అని ప్రకటిస్తున్నారు. 




తాజాగా కరోనా మహమ్మారి గురించి జాగ్రత్తలు చెబుతూ సంగీత దర్శకుడు కోటి ఓ పాటను కంపోజ్ చేశారు. శ్రీనివాస్ మౌళి సాహిత్యం అందించిన ఈ పాటను స్వయంగా కోటినే పాడటం విశేషం. అయితే కరోనాపై రూపుదిద్దుకున్న ఈ సాంగ్‌లో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీం హీరో సాయితేజ్ కూడా గొంతు కలుపుతూ నటించారు. అదీ కూడా ఇంటి వద్ద నుంచే వారు ఈ పాటలో భాగస్వామ్యం కావడం విశేషం. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Advertisement
Advertisement
Advertisement