మూసీకి పెరిగిన ఇన్‌ఫ్లో

ABN , First Publish Date - 2021-09-06T02:03:42+05:30 IST

అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌ నగరంతో పాటు ఎగువ మూసీ పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న

మూసీకి పెరిగిన ఇన్‌ఫ్లో

కేతేపల్లి: అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌ నగరంతో పాటు ఎగువ మూసీ పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు ఆదివారం ఇన్‌ఫ్లో పెరిగింది. శుక్ర, శనివారాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టి వరద తగ్గిన నేపథ్యంలో శనివారం రాత్రి ప్రాజెక్టు రెండు గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి ఐదు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలటంతో ప్రాజెక్టు నీటిమట్టం 641.85 అడుగులకు చేరింది. ఆదివారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 13,822క్యూసెక్కులకు పెరగడంతో 2, 4, 11, 7, 10నెంబర్‌ గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి 12,528 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు.

Updated Date - 2021-09-06T02:03:42+05:30 IST