నల్లగొండ: మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 2,972 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 4,245 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను ప్రస్తుత సామర్థ్యం 3.76 టీఎంసీలుగా నమోదు అయ్యింది. పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా...ప్రస్తుత నీటిమట్టం 642.30 అడుగులకు చేరింది.