తెరుచుకున్న మూసీ ప్రాజెక్ట్ గేట్లు
ABN , First Publish Date - 2021-07-14T15:02:24+05:30 IST
భారీ వరద ప్రవాహం వచ్చి చేరడంతో మూసీ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. దీంతో అధికారు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేశారు.
నల్లగొండ: భారీ వరద ప్రవాహం వచ్చి చేరడంతో మూసీ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేశారు. రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులకు చేరగా...ప్రస్తుత నీటి మట్టం 642.5 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 4,000 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1200 క్యూసెక్కులుగా ఉంది.